Site icon TeluguMirchi.com

ప‌వ‌న్ మాటిస్తున్నాడు

pawan-kalyan(5)వాయిస్ ఓవ‌ర్‌…. టాలీవుడ్ లో ప్ర‌ముఖంగా వినిపిస్తోన్న `మాట‌` ఇది. ప్ర‌తీ సినిమాకీ ఇదో ప్రత్యేక ఆక‌ర్ష‌ణ అయిపోయింది. దాదాపు అగ్ర క‌థానాయ‌కులంతా ఏదో ఒక సినిమాకి గొంతు అరువిచ్చిన‌వాళ్లే. ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ఒక్క‌సారి కూడా వాయిస్ ఓవ‌ర్ కోసం గొంతు విప్ప‌లేదు. అయితే… వ‌రుణ్ తేజ్ కోసం మాత్రం ఈ ఫీట్ చేయ‌బోతున్నాడు. వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ఇటీవ‌లే ఓ చిత్రం కొబ్బ‌రికాయ్ కొట్టుకొంది. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి సంబంధించిన క్రియేటీవ్ స‌ల‌హాలన్నీ ప‌వ‌న్ అందిస్తున్నాడ‌ట‌. తాజాగా ఈ సినిమాకి వాయిస్ ఓవ‌ర్ ఇస్తాన‌ని కూడా ఒప్పుకొన్నాడ‌ట‌. దాంతో వ‌రుణ్ తొలి సినిమాకి ఎక్క‌డ లేని క్రేజ్ వ‌చ్చిచేరింది. ప‌వ‌న్ వాయిస్ ఓవ‌ర్ అందించిన తొలి సినిమాగా ఈ చిత్రం రికార్డుల్లో నిల‌చిపోనుంది.

Exit mobile version