Site icon TeluguMirchi.com

పవన్ కళ్యాణ్ వల్ల ‘సూర్య’ కు పెద్ద కష్టమే వచ్చింది..

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే 04 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దేశ భక్తి నేపథ్యం లో తెరకెక్కిన ఈ మూవీ పట్ల అందరిలో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల నా పేరు సూర్య కు పెద్ద కష్టమే వచ్చినట్లు తెలుస్తుంది.

గత కొంతకాలం గా పెద్ద సినిమాలు రిలీజ్ టైములో ఆంధ్రప్రదేశ్ లో తెల్లవారుఝామును అయిదు గంటల నుంచి షోలు వేసుకునే ఆచారం వుంది. అజ్ఞాతవాసి , భరత్ అనే నేను, రంగస్థలం సినిమాలకు అలాగే పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు నా పేరు సూర్య విషయం లో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాస్త అటుఇటుగా వ్యవహరిస్తుందట.

ఇటీవల పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి దూరం కావడం, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, అలాగే మెగా క్యాంప్ మొత్తం మీడియాతో వైరం పెట్టుకోవడం వంటి పరిణామాలు సంభంవించాయి. దీంతో అయిదు గంటల నుంచి షోలు అడుగుతూ ‘నా పేరు సూర్య’ పెట్టుకన్న దరఖాస్తు అలా పెట్టిన చోటే వుందని తెలుస్తోంది. దానిని కనీసం చూసిన పాపన కూడా పోలేదట తెలుగుదేశం అధికారులు. మరి సూర్య కు బెనిఫిట్ షోస్ వేసుకునే సదుపాయం కల్పిస్తారో లేదో అని మెగా అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

Exit mobile version