సినిమాల సంగ‌తి తేల్చేసిన ప‌వ‌న్‌

Pawan-kalyan(8)

జ‌న‌సేన పార్టీ ప‌నుల్లో బిజీగా ఉన్నాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అటు మెడీకి, ఇటు చంద్ర‌బాబుకి ఎక్కువ ఓట్లు ప‌డేలా ఎలా చేయాలి?? అనే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఈనేప‌థ్యంలో ఆయ‌న సినిమాల‌పై అనుమానాలు నెల‌కొన్నాయి. గ‌బ్బ‌ర్ సింగ్ 2, ఓమైగాడ్ సినిమాలు ముందుకు వెళ్తాయా? వెళ్తే ఎప్పుడు?? అని అభిమానులు బెంగ పెట్టుకొన్నారు. ఈ విష‌యంపై ప‌వ‌న్ ఓ క్లారిటీ ఇచ్చాడు. రాజ‌కీయాల‌తో మ‌మేకమైనా, సినిమాల్ని వదులుకోను.. అన్నాడు. సినిమాల‌కు యేడాదికి క‌నీసం 50 రోజులు కేటాయిస్తాన‌ని మాట ఇచ్చాడు ప‌వ‌న్‌. “ ఇది వ‌ర‌కు ఏడాదికి వంద రోజులు సినిమాల‌కు కేటాయించేవాడిని. ఇప్పుడు కాస్త త‌గ్గించుకోవాలి. క‌నీసం 50 రోజులు షూటింగుల‌తో గ‌డుపుతా..“ అన్నాడు. సో.. ప‌వ‌న్‌సినిమాల‌కు దూరం కాన‌ట్టే. అయితే ఇది వ‌ర‌క‌టిలా యేడాదికి ఒక సినిమా చేసే అవ‌కాశం ఉండ‌దేమో..?? రెండేళ్ల‌కు ఓ సినిమా వ‌స్తుంది. ఈ విష‌యంలో ఫ్యాన్స్ కాస్త స‌ర్దుకుపోవాలి మ‌రి.