మాటలమాంత్రికుడు త్రివిక్రమ్, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ల కాంభోలో ఇది వరకే రెండు చిత్రాలు తెరకెక్కి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ కాంభో మరోసారి రిపీట్ కానుంది. కాగా ఈ చిత్ర టైటిల్‌ను మొదటగా ‘దేవుడే దిగివచ్చిన’ అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత అభిమానులు ‘ఇంజనీర్ బాబు’ అంటూ ఒక టైటిల్‌ను సూచించారు. అయినా కూడా దర్శకుడు ఆ టైటిళ్లతో సంతృన్తి చెందక తాజాగా ఒక టైటిల్‌ను పరిశీలిస్తున్నాడు. అయితే ఈ టైటిల్ ఇంకా ఖరారు అయ్యిందా అనేది మాత్రం అధికారిక సమాచారం లేదు.
పవన్‌కు సరిపోయే కథను సిద్దం చేసి ఇప్పటికే షూటింగ్‌ను జరుపుతుండగా తాజాగా త్రివిక్రమ్ ఈ చిత్రానికి ‘పరదేశ ప్రయాణం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నాడు. దాదాపు ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేయాలనే ఆలోచన చేస్తున్నాడు. ఈ టైటిల్ పట్ల పవన్ కూడా సముఖత వ్యక్తం చేశాడట. అంతేకాకుండా ఈ టైటిల్ అభిమానులకు కూడా దగ్గరయ్యేలాగా ఉంది. టైటిల్ అనేది విడుదల తర్వాత ఎంత ప్రభావం చూపుతుందో మాటల మాంత్రికుడు బాగా అర్థం చేసుకుంటాడు కాబోలు అందుకే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యే టైటిల్‌లను ఫిక్స్ చేస్తాడు. ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమాన్యుయెల్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.