పవన్ సినిమాని కొనేసిన హీరో !

Pawan-Kalyan-and-Trivikramపవన్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం కొత్త రీకార్డులను సృష్టిస్తోంది. టైటిల్ ఖారారు కాకుండానే ఈ చిత్రంకు నైజాం రైట్స్ విషయంలో రికార్డ్ స్థాయి బిజినెస్ జరిగింది. ఇటీవల ‘గుండె జారి గల్లంతయ్యిందే’ చిత్రాన్ని పంపిణీ చేసిన గ్లోబల్ సినిమాస్ సంస్థ పవన్ సినిమాను అత్యధిక రేటుకు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని హీరో నితిన్ ట్విట్టర్ లో తెలిపాడు. “పవన్ సినిమాకు ఉన్న క్రేజ్ నాకు తెలుసు. నేను బయిటకు ఇంతని చెప్పలేను కానీ.. నైజాం రైట్స్ ని మాత్రం అత్యథిక రేటుకు తీసుకున్నాం… అది మాత్రం నైజాం ఏరియాలో పెద్ద రికార్డే” అని ట్విట్టర్ లో ట్విట్ చేశాడు. గ్లోబల్ సినిమాస్ సంస్థలో నితిన్ భాగస్వామిగా వున్న సంగతి తెలిసిందే.