Site icon TeluguMirchi.com

మహేష్ ని దాటేసిన పవన్

pavan maheshపవన్ సినిమా ’అంత్తారింటికి దారేది’ టీజర్ హల్ చల్ సృష్టిస్తోంది. తొలి రోజే టీజర్ ని రికార్డు స్థాయిలో అభిమానులు వీక్షించారు. ఇటీవల వచ్చినమహేష్ ‘వన్ – నేనొక్కడినే’ టీజర్ సృష్టించిన రికార్డులన్నీ ‘అత్తారింటికి.. ‘ దాటికెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. తొలిరోజే ’అత్తారింటికి..’కి దాదాపు 5 లక్షల వ్యూస్ వచ్చాయట . ఈ సంఖ్య రోజురోజుకీ పెరిగే అవకాశాలున్నాయి. మహేష్ ’వన్’ పది లక్షల దగ్గర ఆగిపోయింది. దాన్ని కూడా పవన్ టీజర్ క్రాస్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కొద్దిరోజుల్లో అత్తారింటికి దారేడి ట్రైలర్ కూడా విడుదల కానుంది. దాన్ని ఏ స్థాయిలో వీక్షిస్తారో మరి? మహేష్ నుంచి మరో ప్రచార చిత్రం వచ్చే వరకూ పవన్ టీజరే.. నంబర్ వన్ గా నిలబడడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version