Site icon TeluguMirchi.com

గబ్బర్ సింగ్ 2 తర్వాత పవన్ సినిమా!

pavanగబ్బర్ సింగ్ 2′ సినిమా తర్వాత పవన్ చేయబోయే సినిమా ఖరారైంది. రవితేజతో ‘బలుపు’ చిత్రాన్ని నిర్మించిన ‘పీవీపీ సినిమా’ సంస్థ తో పవన్ ఓ సినిమా చేయబోతున్నాడు. గబ్బర్ సింగ్ 2′ సినిమా పూర్తైన తరువాత ఈ చిత్రం ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని తమ బ్యానర్ స్థాయిని పెంచే విధంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించడానికి పీవీపీ ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఇక పవన్ తాజా చిత్రం ‘అత్తారింటికి దారేది’ ఆగస్ట్ 7న విడుదలకు సిద్దమైంది.

Exit mobile version