Site icon TeluguMirchi.com

పవన్ – రేణు విడాకుల వెనుక ఉన్న వాస్తవాలు ఏంటి..?

ఎంతకాలం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలాంటి కామెంట్స్ చేసిన సర్దుకుపోయానని , రోజు రోజుకు వారి కామెన్స్ మితిమీరిపోతున్నాయని ,నేను నోరు విప్పానంటే అభిమానుల పొగరు మురికి కాలువలో పడి కొట్టుకుపోతుందని రేణూ దేశాయ్‌ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇటీవలే రేణు దేశాయ్ రెండో పెళ్ళికి సిద్దమైన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యం లో అభిమానులు రేణు ఇన్‌స్టాగ్రాంలో రకరకాల కామెంట్స్ పెడుతూ ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. ఈమె రెండో పెళ్లికి తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ సైతం అభ్యంతరం చెప్పకుండా తన విషెష్ ను అందిస్తే , అభిమానులు మాత్రం రేణు ఏదో తప్పు చేస్తున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు. దీంతో వీరిని కంట్రోల్ చేయకపోతే బాగోదనుకుందో ఏమో కానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రాంలో అభిమానులకు గట్టిగానే హెచ్చరించింది.

ఇన్నేళ్లుగా విడాకుల వ్యవహారంపై తాను మౌనంగా ఉన్నందుకు పవన్ అభిమానులు కృతజ్ఞులుగా ఉండాలని తెలిపింది. తాను నోరు తెరచి, విడాకుల వెనుక వాస్తవాలను చెబితే అవివేకులైన, మర్యాద తెలియని అభిమానులకు గర్వభంగం అవుతుందని చెప్పారు. తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలోకి ప్రవేశించి ఏడుపు గొట్టు కథలు చెప్పే అధికారం పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు లేదని రేణూ దేశాయ్‌ స్పష్టం చేశారు. పవన్‌ కల్యాణ్‌ అభిమానుల నెగటివిటీని తానెందుకు భరించాలని ప్రశ్నించారు.

వాళ్ల నెగటివిటినీ భరించాల్సినంత తప్పు తానేం చేశానని అడిగారు. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అపరిపక్వత ఎలా అవుతుందని నిలదీశారు. ఇకనైనా తన ఇన్‌స్టాగ్రాంలోకి వచ్చి సలహాలు ఇవ్వడం ఆపేయాలని కోరారు. ‘‘అభిమానుల అవధుల్లేని మూర్ఖత్వానికి తెరపడి నేను స్వేచ్ఛగా సోషల్‌ మీడియాను తెరిచి నా గురించి, నా పని గురించి కామెంట్లు చదువుకొనే రోజు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని తెలిపింది. రేణు తెలిపిందని ప్రకారం చూస్తే పవన్ – రేణు విడాకుల వెనుక పెద్ద వ్యవహారమే ఉందని , అది రహస్యం గా దాచిపెట్టారని అందరికి అర్ధమవుతుంది. ఇలాగే అభిమానులు రెచ్చిపోతే రేణు ఆ రహస్యాలు బయట పెట్టడం ఖాయం. ఒకవేళ బయటపెడితే పవన్ నిజస్వరూపం తెలుస్తుందా..? ఏమో..? చూడాలి.

Exit mobile version