Site icon TeluguMirchi.com

ప‌వ‌న్ కూడా త‌గ్గలేదు

pavanఎవ‌డు, అత్తారింటికి దారేది విడుద‌ల తేదీలు ఖ‌రారయ్యాయి. బాబాయ్ కోసం అబ్బాయ్, అబ్బాయ్ కోసం బాబాయ్ ఆగుతార‌నుకొంటే అదేం జ‌ర‌గ‌లేదు. ఎవ‌రి మొండిధైర్యంవారిది. అత్తారింటికి దారేది ఆగ‌స్టు 7న రావ‌డం ఖాయ‌మ‌నేది రెండు నెల‌ల ముందు నుంచీ తెలుసు. అయినా స‌రే దిల్‌రాజు స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణయం తీసుకోలేదు. దాంతో ఈ రెండు మెగా సినిమాల మ‌ద్య కేవ‌లం విరామం వార‌మే వ‌చ్చింది. ఎవ‌డు సినిమాని వాయిదా వేయాల‌న్న ఆలోచ‌న వ‌చ్చినా, జంజీర్ ని దృష్టిలో ఉంచుకొని ఎవ‌డుని అనుకొన్న తేదీకే విడుద‌ల చేయ‌క‌త‌ప్పలేదు.

ఎవ‌డు 31 వ‌స్తుంది అనే విష‌యం తెలియ‌గానే అత్తారింటికి వాయిదా వేస్తార‌నేది దిల్ రాజు ప్లాన్‌. అయితే ప‌వ‌న్ బృందం ఎక్కడా తగ్గలేదు. 7నే వ‌స్తున్నాం.. అని ప‌దే ప‌దే బ‌ల్లగుద్ది మరీ చెబుతున్నారు. దాంతో దిల్‌రాజు క్యాంప‌స్‌లో కంగారు మొద‌లైంది. ఓ వారం రోజులు వాయిదా వేసుకోండి.. అని బ‌తిమాల‌డాలు, బుజ్జగించ‌డాలూ జ‌రిగినా – అత్తారింటికి దారేది టీమ్ ఎక్కడా త‌గ్గలేద‌ట‌. మొత్తమ్మీద బాబాయ్ అబ్బాయ్ పోటా పోటీగా సినిమాలు వదులుతున్నారు. మ‌రి వారి భ‌విత‌వ్యం ఎలా ఉంటుందో?

Exit mobile version