Site icon TeluguMirchi.com

పవన్ సినిమా ‘కొణిదెల ఎల్ ఎల్ బి’ ??

pawanఅదేంటి.. పవన్ ఈ టైటిల్ తో సినిమా ఎప్పుడు చేస్తున్నారని ఆలోచిస్తున్నార ? అయితే దీనిపై క్లారీటి దర్శకుడు మారుతి ఇస్తారు. ప్రతి ఒక్క దర్శకుడికి పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాలని వుంటుంది. మారుతి కి కూడా ఆ కోరిక బలంగానే వుంది. ఇదే అంశం పై ఇటీవల జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో మారుతి మాట్లాడారు. పవన్ తో సినిమా చాన్స్ వస్తే సబ్జెక్టు, టైటిల్ ఎలా వుంటాయి ? అన్న ప్రశ్నకు బదులు చెబుతూ..’ పవన్ తో సినిమా నా డ్రీమ్. పవన్ ను డేరింగ్ అండ్ డాసింగ్ వున్న లాయర్ గా చూడాలనుకుంటున్నాను.ఆ చిత్రానికి ఓ టైటిల్ కూడా అనుకున్నాను. అదే ‘కొణిదెల ఎల్.ఎల్.బి’ అని పవన్ తో తన డ్రీం విశేషాలు చెప్పారు. మరి మారుతి కోరిక నెరవేరుతుందా? లేక కల గానే మిగిలిపోతుందో ? చూడాలి.

Exit mobile version