అబ్బా..ఎంత కాలం అయ్యింది వీరిద్దరిని ఇలా చూసి…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాల రోజుల తర్వాత అన్నయ్య చిరంజీవి ని కలిశారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలతో మునిగిపోయాడు. కుటుంబ సబ్యులను కలిసే సమయం కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాస్త విశ్రాంతి దొరకడం తో బుధవారం తన అన్నయ చిరంజీవిని కలిశారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ కూడా చిరంజీవిని కలిసినవారిలో ఉన్నారు.

ఈ పిక్ ఆలా బయటకు వచ్చిందో లేదో మెగా అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు..అబ్బా ఎంత కాలం అయ్యింది వీరిద్దరిని ఇలా చూసి అని తెగ మురిసిపోతున్నారు. ప్రస్తుతం చిరంజీవి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘సైరా’ చిత్రంలో నటిస్తున్నాడు. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కొణిదెల ప్రొడక్షన్స్‌పై రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.