రాధాకృష్ణ కు సంస్కారం నేర్పించు బాబు – పవన్

సినీ నటుడు & జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ABN రాధాకృష్ణ ఫై కసి తీర్చుకుంటున్నాడు. గత కొంతకాలం గా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వచ్చినందుకు ఆ కాసింత ట్విట్టర్ ద్వారా తీర్చుకుంటాడు. కేవలం ABN , టీవీ 9 లపై తన కోపాన్ని తీర్చుకోవడానికే ట్విట్టర్ వాడుతున్నట్లు అర్ధం అవుతుంది.

తాజాగా పవన్ కళ్యాణ్ రాధాకృష్ణ కు కాస్త సంస్కారం నేర్పించు బాబు అంటూ రాధాకృష్ణ ఫ్యామిలీ ఫోటో ను పోస్ట్ చేసి కామెంట్ పెట్టాడు. “బాబు నాన్నగారికి రాత్రి భోజనంలో అన్నం, కూర, పప్పు తో పాటు కొంచెం సంస్కారాన్ని కూడా వడ్డించమని చెప్పరా..అలాగే సంస్కారవంతమైన సబ్బుతో తల స్నానం చెయ్యమని చెప్పండి ” అంటూ పవన్ తన ట్విట్టర్ పోస్ట్ చేసాడు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అభిమానులైతే ఆలా పవన్ పోస్ట్ పెట్టాడో లేదో దానిని విపరీతంగా షేర్ & లైక్స్ చేస్తూ దానిని వైరల్ గా మారుస్తున్నారు. మొత్తానికి పవన్ ఎక్కడ తగ్గడం లేదని తెలుస్తుంది.