పవన్ కల్యాణ్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. విడుదలకు ముందే పైరసీ సీడీలు బయటకు వచ్చేసినా, థియేటర్ల దగ్గర సంచలనాలు సృష్టించింది అత్తారింటికి దారేది. ఇప్పుడు బుల్లితెరలోనూ తెగ ఆడేసింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని మా టీవీలో టెలీకాస్ట్ చేశారు. ఈ సినిమాకి 19.04 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకూ ఇదే అత్యుత్తమం. ఈ విషయాన్ని అత్తారింటికి దారేది నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాధ్ ధృవీకరించారు. ”టీవీల్లోనూ మా సినిమాకి తిరుగులేదు. ఇది పవన్, త్రివిక్రమ్ వల్లే సాధ్యం” అని చెప్పారాయన.