‘ఉస్తాద్ భగత్ సింగ్’.. కొన్ని బంధాలు ఎప్పటికీ మారవు !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. అయితే మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. అయితే తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రకటించారు మేకర్స్.

త్వరలోనే ఈ సినిమా భారీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. చరిత్రని తిరిగి రాద్దాం అంటూ సరికొత్తగా వెల్లడించారు మేకర్స్. కొన్ని విషయాలు, కొన్ని బంధాలు ఎప్పటికీ మారవు అని గబ్బర్ సింగ్ చిత్రం చిత్రీకరణ సమయం లోని కొన్ని ఫోటోలు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణకి సంబందించిన కొన్ని ఫోటోలు జత చేస్తూ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.