‘కాటమరాయుడు’ చిత్రం తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా వెంటనే నటించడానికి రెడీ అయ్యాడు. తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్, త్రివిక్రమ్‌ల కొత్త చిత్రం ఏప్రిల్ 7 నుండి రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోవడానికి ముహర్తం ఫిక్స్ అయ్యింది. అందుకు వరుస షెడ్యూల్‌లను ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఏప్రిల్‌లో మొదలు కాగానే వెంట వెంటనే షూటింగ్ జరిపి సెప్టెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రానికి ‘దేవుడే దిగివచ్చినా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.