పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ‘కాటమరాయుడు’ చిత్రంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం తర్వాత పవన్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఇక రెగ్యులర్ షూటింగ్‌ను మొదలు పెట్టడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. పవన్ కూడా పెద్దగా విరామం తీసుకోకుండా త్రివిక్రమ్ సెట్లో పాల్గోనడానికి ఒకే చెప్పాడు. త్వరలో పవన్ పూర్తి స్థాయి రాజకీయ బరిలోకి దిగడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి వీలైనంత త్వరగా తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని భావిస్తున్నాడు.
‘కాటమరాయుడు’ చిత్రం తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా వెంటనే నటించడానికి రెడీ అయ్యాడు. తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్, త్రివిక్రమ్‌ల కొత్త చిత్రం ఏప్రిల్ 7 నుండి రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోవడానికి ముహర్తం ఫిక్స్ అయ్యింది. అందుకు వరుస షెడ్యూల్‌లను ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఏప్రిల్‌లో మొదలు కాగానే వెంట వెంటనే షూటింగ్ జరిపి సెప్టెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రానికి ‘దేవుడే దిగివచ్చినా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.