Site icon TeluguMirchi.com

నిహారిక చేతి పై పవన్ పచ్చ బొట్టు…

pawan-tatto-niharikaపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమానులు భక్తుల రూపం లో ఉంటారని అందరికి తెలుసు..ఒక్కోసారి వారి భక్తి చేసి ఇతర హీరోలు ఈర్ష పడేవిధంగా ఉంటుంది..తాజాగా ఈ యువతి అభిమానాన్ని చూస్తే మీకే అర్థం అవుతుంది..

ఈ అమ్మాయి పేరు మండలి నిహారిక… పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం..తన 20 ఏళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులు బలవంతపు పెళ్లి చేశారు. ఆ ఆతరువాత కొన్నాళ్లకు భర్త పెట్టే చిత్ర హింసలు భరించలేక నిహారిక ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. కానీ సగం కాలిన గాయాలతో బయటపడింది. ఆ భయంకర పరిణామంతో చలించిపోయిన నిహారిక, దేశ విదేశాల్లో ఉన్న తనలాంటి వారికి అండగా నిలుస్తూ ప్రసంశలు అందుకుంటోంది. తనలో ఈ మార్పుకు కారణం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం , తన మాటలే అంటుంది.. ఆయనను చేసిన తర్వాతే తనలో ఈ మార్పు వచ్చిందని అందుకే తన పేరునే నా చేతి పై పచ్చబొట్టు వేయించుకున్నాని, నాకు తల్లిదండ్రులు అంటే పవన్ కళ్యాణ్ నే అని తేల్చి చెపుతుంది..

Exit mobile version