పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటో దగ్గరి వారికి తప్ప ఎవరికి అర్ధం కాదు. తనకు నచ్చిన వారికి పవన్ రకరకాల బహుమతులు ఇస్తూ సర్‌ప్రైజ్ చేస్తూ ఉంటాడు. తప ఫామ్ హౌస్‌లోని పండ్లను, ఇంకా రకరకాల బహుమతులను ఇస్తు ఉంటాడు. పవన్ బహుమతులు అందుకున్న వారందరు కూడా సర్‌ప్రైజ్ అయ్యి చాలా సంతోషిస్తారు. అది చూసి పవన్ ఇంకా సంతోషిస్తాడు అని చెప్పవచ్చు. తాజాగా పవన్ ఇచ్చిన గిఫ్ట్ వల్ల చాలా సర్‌ప్రైజ్ అయిన హీరోయిన్ ఒకరు తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. పవన్, త్రివిక్రమ్‌ల తాజా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న అనూ ఇమాన్యుయెల్‌కు పవన్ అప్పంను బహుమతిగా పంపాడట. పవన్ తనకోసం అప్పం మరియు రకరకాల కూరలు వండిరచి పంపాడని, వాటిని చూసి చాలా సంతోషించా అని, ఇది ఎప్పటికి మరిపోలేని మెమొరీ అంటూ అను చెప్పుకొచ్చింది.
షూటింగ్ విరామం సమయంలో ఓ సారి పవన్ తనను నువు ఏది ఇష్టంగా తింటావు అని అడిగాడట. అందుకు తాను అప్పం అంటే ఇష్టం అని చెప్పానని అప్పుడు ఏదో కాజువల్‌గా అడిగాడనుకున్నా కానీ ఇలా సర్‌ప్రైజ్ ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉంది అని అనూ ఇమాన్యుయెల్ చెప్పుకొచ్చింది. అప్పం అంటే మనదగ్గర ఉండే అట్లలాంటివి. పవన్ వీటిని ప్రత్యేకంగా చేయించి అను ఇమాన్యుయెల్‌కు పంపాడట. వాటిని చూసి అను సంతోషంతో ఉబ్బితబ్బి పోతుంది.