Site icon TeluguMirchi.com

ప‌వ‌న్ యాడ్లు ఎందుకు చేయ‌డం లేదు..?

pavanయాడ్ ప్రపంచంలో మ‌హేష్‌బాబుకి తిరుగులేదు. తెలుగు హీరోల్లో… ఆ మాట‌కొస్తే ద‌క్షిణాదినే అత్యధిక విలువ గ‌ల బ్రాండ్ అంబాసిడ‌ర్ మ‌హేష్‌. ఈ ఒక్క విష‌యంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే మ‌హేష్ ఓ అడుగు ముందున్నాడు. మ‌రి ప‌వ‌న్‌కీ అంతే క్రేజ్ ఉంది క‌దా..? ప‌వ‌న్ సినిమాలు కూడా బాక్సాఫీసును రికార్డు వ‌సూళ్లతో ముంచెత్తుతున్నాయ్ క‌దా, మ‌రి అత‌నికి బ్రాండ్ విలువ ఎందుకు లేదు..?? ప‌వ‌న్ ఎందుకు యాడ్లు చేయ‌డం లేదు..?

ఇది వ‌ర‌కు అన్నయ్య చిరంజీవితో పోటీ ప‌డ్డాడు ప‌వ‌న్‌… యాడ్స్ విష‌యంలో. అన్నయ థ‌మ్స్ అప్ యాడ్‌తో మెరిస్తే, త‌మ్ముడు పోటీగా పెప్సీ బ్రాండ్ సొంతం చేసుకొన్నాడు. అయితే క్రమంగా పెప్సీ బ్రాండింగ్‌నీ వ‌దులుకొన్నాడు ప‌వ‌న్. ఆ తర‌వాత మ‌రే ఇత‌ర కంపెనీకి ప్రచార‌క‌ర్తగా వ్యవ‌హ‌రించ‌లేదు. అయితే కార్పొరేట్ సంస్థలు మాత్రం ప‌వ‌న్‌కి భారీ పారితోషికాల‌తో గాలాలు వేశాయి. ప‌వ‌న్ అనుమ‌తి కోసం ప‌డిగాపులుకాశాయి. గ‌బ్బర్ సింగ్ త‌ర‌వాత ఈ జోరు మ‌రింత ఎక్కువైంది. అత్తారింటికి దారేది ఫ‌లితంతో.. ప‌వ‌న్ చుట్టూ ప్రద‌క్షిణాలు చేసే కార్పొరేట్ సంస్థలు మ‌రింత ఎక్కువ‌య్యాయి. అయితే అన్నింటికీ నో చెప్పేసేశాడ‌ట ప‌వ‌న్‌. వినియోగ‌దారుల‌ను మోసం చేయ‌ని కంపెనీల‌కే త‌ను ప్రచారం చేస్తాన‌ని ష‌ర‌తులు విధిస్తున్నాడ‌ట. చ‌ట్ట వ్యతిరేక కార్యక‌లాపాల‌కు పాల్పడితే… త‌న ఒప్పందం ర‌ద్దు చేసుకొంటాన‌ని హెచ్చరిస్తున్నాడ‌ట‌. దాంతో కార్పొరేట్ సంస్థలు ప‌వ‌న్ తో ఒప్పందం చేసుకోవ‌డానికి భ‌య‌ప‌డుతున్నాయి. పారితోషికాల‌కు ప‌డిపోకుండా, తాను న‌మ్మిన సిద్ధాంతాల ప్రకారం న‌డుస్తున్న ప‌వ‌న్ నిజంగా… గ్రేట్. హీ ఈజ్ రియ‌ల్ ప‌వర్ స్టార్‌!

Exit mobile version