Site icon TeluguMirchi.com

Pawan Kalyan : నేను ‘ఓజీ’ అంటే మీరు ‘క్యాజీ’ అంటారు : పవన్ కళ్యాణ్


ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా భాద్యతలు నిర్వహిస్తూ బిజీగా వున్న పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడంపై స్పందించారు. తాజాగా ఉప్పాడలో నిర్వహించిన వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక అక్కడికి వచ్చిన పవన్ అభిమానులు ఓజీ ఓజీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

#pawankalyan #og #OGUpdate Pawan Kalyan about OG

అప్పుడు పవన్ కళ్యాణ్.. ‘ఓజీ’ ఆ, అసలు సినిమాలు చేసే టైమ్ ఉందంటారా? ఎలాగో మాట ఇచ్చాను కాబట్టి ముందు ఒక మూడు నెలలు, మీరు ఒక్కరోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని నన్ను తిట్టకూడదు కాబట్టి కనీసం గ్రామాల్లో కొత్త రోడ్ల కంటే ముందు పాత రోడ్లకే ఉన్న గుంతలు పూడ్చాలి. లేదంటే నిన్ను ఎన్నుకుంటే నువ్వెళ్లి ఓజీ ఓజీ చేస్తావా? క్యాజీ అంటే నేనేం చెప్పను. మా నిర్మాతలకు కూడా చెప్పాను కొంచెం క్షమించాలి. మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసుకుంటూ, కుదిరితే రెండు మూడు రోజులు పనికి అంతరాయం కాకుండా షూటింగ్ చేస్తానని చెప్పాను. అంతేకాదు ఓజీ చూద్దురుగాని బాగుంటుంది’ అంటూ ఫ్యాన్స్‌లో ఆసక్తి రేకెత్తించారు పవన్ కళ్యాణ్.

Vishwaksen : లేడీ గెటప్ లో విశ్వక్ సేన్.. మెస్మరైజింగ్ ఐ లుక్ రిలీజ్

Exit mobile version