Site icon TeluguMirchi.com

‘ బెంగాల్ టైగర్ ” గా పవన్ కళ్యాణ్ ?

pavankalyanగబ్బర్ సింగ్ గా చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్ ‘ బెంగాల్ టైగర్ ‘ గా అవతారం ఎత్తనున్నాడా ?….. అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. గబ్బర్ సింగ్ కు సీక్వెల్ గా నిర్మించదలచుకున్న ‘ గబ్బర్ సింగ్ – 2 ‘ సినిమాకు ఆ టైటిల్ సమస్యగా మారిన విషయం తెలిసిందే. ఆ టైటిల్ తమ ‘ షోలే ‘ సినిమాలో ప్రధాన పాత్రదారిదని,అందువల్ల ఆ టైటిల్ ను వాడుకోవాలంటే తమ అనుమతి తప్పనిసరి అని ‘ షోలే ‘ నిర్మాతలు పేచీ పెట్టారు. పైగా ఆ టైటిల్ కు అనుమతి ఇవ్వాలంటే 3 కోట్లు చెల్లించాలని కూడా షరతు విధించారు. కేవలం టైటిల్ కోసం 3 కోట్లు వృధా చేయటం ఇష్టం లేని నిర్మాతలు తమ చిత్రానికి వేరే టైటిల్ పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ‘ బెంగాల్ టైగర్’ అనే టైటిల్ ను ఖరారు చేసారని, ఆ టైటిల్ కు పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. నిస్సందేహంగా ఇది పవన్ కళ్యాన్ కు సరైనదని చెప్పవచ్చు.

Exit mobile version