దాంతో చిత్ర యూనిట్ వారు చాలా అతి చేస్తున్నారు. మొదటి మూడు రోజుల్లోనే 30కోట్లను రాబట్టాలి అని ప్లాన్ చేసుకుని మరీ టికెట్ రేట్లను భారీగా పెంచుతున్నారు. దాంతో సీ క్లాస్ ప్రేక్షకుడు ఈ చిత్రం చూడడం గగనమే అవుతుంది. పది రూపాయలు ఉండే టికెట్‌ను 50 రూపాయలుగాను, 50 రూపాయలు ఉండే టికెట్ ధరను 500లకు పెంచుతున్నారు. అంతేకాకుండా అభిమానుల కోసం భారీగా ఏర్పాటు చేస్తున్న ప్రీమియర్ షోల టికెట్ ధరను కూడా భారీగా పెంచుతున్నారు.
500రూపాయలు ఉండే టికెట్ ధరను ఏకంగా 2000 నుండి 5000వరకు అమ్మాలని భావిస్తున్నారట. ఎలాగు పవన్ అభిమానులు కాబట్టి ఈ మాత్రం లేకపోతే ఎలా అని చిత్ర యూనిట్ భారీ మొత్తంలో టికెట్ ధరలను పెంచుతున్నారు. దాంతో చాలామంది పవన్ అభిమానులు ఆందోళన పడుతున్నారు. మొత్తానికి రాయుడి రేట్లు దిమ్మదిరిగేలా అదరిపోతున్నాయ్ కదా!