పవర్‌స్టార్ పవన్‌కళ్యాన్ సినీ జీవితంలో ఎంత క్లారిటీగా ఉంటాడో వ్యక్తిగత జీవితంలో అంత తికమకగా ఉంటాడు అని అంతా అనుకుంటారు. కానీ పవన్ సన్నిహితులు మాత్రం పవన్‌ను దగ్గరి నుండి చూస్తే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఈయన గుణం తెలుసుకోవాలంటే దగ్గర ఉంటేనే తెలుస్తుంది అని చెబుతుంటారు.
పవన్‌కు దగ్గరయిన వారిని ఎంత బాగా చూసుకుంటాడో దూరం అయినా వారి పట్ల కూడా అంత కక్ష్యగా ఉంటాడు అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. పవన్ తాజాగా డాలీ దర్శకత్వంలో ‘కాటమరాయుడు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. ఈ నెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
పవన్ నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రంలో పవన్‌కు సోదరులుగా శివబాలాజి, కమల్ కామరాజు, చైతన్య కృష్ణలు నటిస్తున్నారు. పవన్‌కు తమ్ముడిగా నటిస్తున్న శివబాలాజి పుట్టిన రోజు సందర్భంగా పవన్ స్వయంగా కేకు తెప్పించి మరీ సెలబ్రేట్ చేశాడు. దాంతో పవన్ అభిమానం చూరగొన్న శివబాలాజి మరియు మిగతా సోదరులు జనసేన లోగోతో పవన్ ఫొటో ఉన్న ఖడ్గాన్ని పవన్‌కు బహుమతిగా ఇచ్చారు. దాంతో పవన్ మరియు సోదరుల మద్య స్నేహం బాగా పెరిగిందట.
సోదరులుగా నటించిన వారు పవన్‌కు బాగా దగ్గర కావడంతో పవన్ వారిని చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటున్నాడు అని సమాచారం. కేవలం తమ్ముళ్లతోనే కాకుండా సెట్లో ఉండే అందరితో కూడా చాలా సరదాగా ఉంటున్నాడట. ఒక స్టార్ హీరో అనే ఫీలింగ్ లేకుండా చిన్న ఆర్టిస్టులతో సైతం పవన్ చాలా దగ్గరగా ఉంటాడట. అందుకే మెగా ఫ్యామిలి అంతా కూడా పవన్ అంతే అదో టైపు అని విమర్శిస్తూ ఉంటారు. స్టార్ హీరో అనే గర్వాన్ని పవన్ అసలే చూపడు, కాని ఇలా ఎవరికి సాద్యం కాదు అని ఈయన సన్నిహితులు చెబుతుంటారు.