ఉయ్యాలవాడ ఇచ్చిన స్పూర్తితో.. ఉత్తరాదిన స్వాతంత్ర ఉద్యమం మొదలౌతుంది. ఝాన్సీ లక్ష్మీభాయ్ బ్రిటిష్ దొరలపై పోరాటం చేస్తుంది. ఝాన్సీ లక్ష్మి భాయ్ పాత్రలో అనుష్క కనిపిస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉరి తరువాత ఐదు నిమిషాలపాటు సినిమా నడుస్తుందట. ఈ చివరి ఐదు నిముషాలు అనుష్క కనిపిస్తుంది. అనుష్క పోరాటానికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తాయి. ఇక ఎండింగ్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో సినిమా ముగుస్తుందట. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ లో పవన్ వాయిస్ ఊపిరి పోయగా ..సినిమాకు ప్రాణం పోస్తుందని మెగా అభిమానులు భావిస్తున్నారు.