Site icon TeluguMirchi.com

గబ్బర్ సింగ్ పాటలన్నీ టైటిల్సే !

Sai Dharamపవన్ సినిమాలకే కాదు ఆ సినిమాలోని పాటలకు కూడా విపరీతమైన క్రేజ్ వుంటుంది. ముఖ్యంగా పవన్ హిట్ సాంగ్స్ లోని కొన్ని లిరిక్స్ మాంచి క్యాచిగా వుంటాయి. అందుకే ఈ క్యాచి పదాలను టాలీవుడ్ లో సినిమా టైటిల్స్ గా పెట్టుకుంటున్నారు. ఈ మధ్యనే పవన్ సినిమాలో ఓ పాటలో వచ్చే పదంతో నితిన్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా చేసి బంపర్ హిట్ కొట్టేశాడు. ఇప్పుడు పవన్ మేనల్లుడు సాయి ధరమ్ మరో పాట ‘పిల్లా నువ్వు లేని జీవితం’ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఏ. యస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సాయిధరమ్ నటిస్తున్న తాజా చిత్రానికి ఈ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం లో రెజీనా కథానాయికగా నటిస్తోంది.

Exit mobile version