పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘కాటమరాయుడు’ చిత్రాన్ని చేస్తున్నాడు. చిత్ర షూటింగ్ సమయంలో ఒక సీన్‌లో హీరోయిన్ శృతిహాసన్‌ను హీరో అయిన పవన్ కళ్యాణ్ ఎత్తుకుని హాస్పిటల్‌కు తీసుకు వెళ్లాలి. అయితే దర్శకుడు చెప్పిన ఆ సీన్ తన వల్ల కాదని పవన్ తేల్చి చెప్పాడట. తన నడుము నొప్పి కారణంగా ఆమెను ఎత్తడం తన వల్ల అయ్యే పని కాదని, అందుకు ఆల్టర్నేట్ చూడాల్సిందిగా దర్శకుడిని పవన్ కోరినట్లుగా తెలుస్తోంది.
చాలా సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ నడుము నొప్పితో బాధపడుతున్నాడు. అప్పట్లో పవన్ కళ్యాణ్ నడుము నొప్పి కారణంగా ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అదే నడుము నొప్పి ఇప్పటికి కూడా పవన్‌ను వెంటాడుతూనే ఉందని తెలుస్తోంది. ఆ నడుము నొప్పి కారణంగానే ఆయన శృతిహాసన్‌ను లిఫ్ట్ చేసేందుకు సాహసించలేదని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. యాక్షన్ సన్నివేశాలు చేసే సమయంలో కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుని మరీ పవన్ ఆ సీన్స్ చేస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు అంటున్నారు.