Site icon TeluguMirchi.com

Bro : పవన్ కళ్యాణ్ ఊర మాస్ డ్యాన్స్..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటించారు. జూలై 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది చిత్రబృందం. పవన్‌ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్‌, తమన్‌కు సంబంధించిన ఓ డ్యాన్స్‌ వీడియో షేర్‌ చేసింది. ఈ వీడియోలో ‘నబో నబో నబ్బరిగాజులు’ అంటూ మామ, అల్లుళ్లతో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్ కూడా ఊర మాస్ లుక్ లో స్టెప్పులు అదరగొట్టేసారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తమ్ముడు చిత్రంలోని మాస్‌ గెటప్‌ను రీ క్రియేట్‌ చేస్తూ.. లుంగీ, కళ్లద్దాలతో కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ పాట పవర్‌ స్టార్ నటించిన గుడుంబా శంకర్‌లోని సూపర్‌ హిట్ సాంగ్ కిల్లీ కిల్లీ న్యూ వెర్షన్‌. మరి ఇంకెదుకు ఆలస్యం మీరు చూసేయండి.

BRO - Killi Killi Fan Feast | Pawan Kalyan | Sai Dharam Tej | Thaman S | July 28th Release

Exit mobile version