Site icon TeluguMirchi.com

ప‌వ‌న్ మ‌ళ్లీ సంచ‌ల‌నం రేపాడు!

pavanప‌వ‌న్ క‌ల్యాణ్ ఏం మాట్లాడినా సంచ‌ల‌న‌మే. ఈ మౌన ముని ఎప్పుడెప్పుడు నోరు విప్పుతాడా?? అని అభిమానులు వెయ్యి చెవుల‌తో ఎదురుచూస్తుంటారు. సినిమా, రాజ‌కీయాలు, సామాజిక అంశాలు ఏ టాపిక్ అయినా.. ప‌వ‌న్ నుంచి వ‌చ్చిందంటే అది హాట్ టాపిక్కే. అలాంటి ప‌వ‌న్ నోటి నుంచి పోలిటిక‌ల్ ఎంట్రీ క‌బురు వినిపించింది. ప‌వ‌న్‌రాజ‌కీయాల్లోకి వ‌స్తాడా?? వ‌స్తే ఏ పార్టీలో చేర‌తాడు?? అనే విష‌యంమీద గ‌త కొంత‌కాలంగా చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. ఇప్పుడు ప‌వ‌న్ దానికి ఆజ్యం పోశాడు. మీరు రాజ‌కీయాల్లో మ‌ళ్లీ ఎప్పుడొస్తారు?? అని ఓ ఇంట‌ర్యూలో అడిగిన ప్రశ్నకు ”నేను రాజ‌కీయాల‌కు దూరం అయితేనే కాదా, మ‌ళ్లీ రావ‌డానికి” అని తెలివిగా స‌మాధానం చెప్పాడు ప‌వ‌న్‌! నేను రాజ‌కీయాల్లోనే ఉన్నా అనే సంకేతాలు పంపాడు. త్వర‌లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో ప‌వ‌న్ స్టేట్ మెంట్ చాలా ప్రాధాన్యత సంత‌రించుకొంది. ఈ మాట‌ల వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోగ‌లిగితే ప‌వ‌న్ కి పాలిటిక్స్ పై క్రేజ్ ఉంద‌నే తెలుస్తోంది. మ‌రి ఈ మాట‌.. ఆయ‌న్ని ఎక్కడి వ‌ర‌కూ తీసుకెళ్తుందో, రాజ‌కీయాల్లో ఎలాంటి సంచ‌ల‌నాల‌కు కేంద్రబిందువు అవుతుందో చూడాలి.

 

Exit mobile version