Site icon TeluguMirchi.com

పవన్ బాలీవుడ్ ఎంట్రీ ??

Attarintiki_Daredi_photos_09అత్తారింటికి దారేదిది టాలీవుడ్‌నే కాదు.. యావ‌త్ భార‌త చిత్రసీమ‌నే నివ్వెర ప‌రిచింది. విడుద‌ల‌కు ముందే ఓ సినిమా పైర‌సీ రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చేసినా… వ‌సూళ్ల సునామీ సృష్టించ‌డం అంద‌రినీ ఆశ్చర్యప‌రిచింది. టాలీవుడ్ హీరోలంటే త‌క్కువ స్థాయిగా చూసే బాలీవుడ్ విశ్లేష‌కులు సైతం ప‌వ‌న్ ప్రభంజ‌నానికి ముచ్చట ప‌డ్డారు. ప‌వ‌న్‌కి ఉన్న ఓవ‌ర్సీస్ మార్కెట్ వారి దృష్టిలో ప‌డింది. ఓవర్సీస్‌లో షారుఖ్ ఖాన్ సినిమాల్ని త‌ల‌ద‌న్నేలా.. వ‌సూళ్లు కురిపించుకొన్నాడు ప‌వ‌న్‌. చెన్నై ఎక్స్‌ప్రెస్ కంటే.. స్పీడుగా అత్తారింటికి అక్కడ దూసుకెళ్లిపోయింది. ఒక్క వారంలో రూ. 14 కోట్లు వ‌సూళ్లు చేసి ఔరా…?? అనిపించింది. అందుకే ప‌వ‌న్ వైపు అక్కడి నిర్మాత‌లు దృష్టి పెట్టారు. ప‌వ‌న్ సినిమా అత్తారింటికి దారేదిని హిందీలో రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది?? అనే ఆలోచ‌న ప‌క్కన పెట్టి, అస‌లు ఆ సినిమాని మ‌ళ్లీ ప‌వ‌న్‌తో తీస్తే ఎలా ఉంటుంది?? అని ఆలోచిస్తున్నార‌ట‌. ఇందుకు సంబంధించి ప‌వ‌న్‌కి భారీ పారితోషికాన్ని ఎర వేయ‌డానికి కూడా సిద్ధ ప‌డుతున్నార‌ని స‌మాచార‌మ్‌. ప‌వ‌న్ ఏ టీమ్ కోరితే అది ఇవ్వడానికి కూడా రెడీ అట‌. కానీ… ప‌వ‌న్ బాలీవుడ్ వెళ్తాడా?? అన్నది పెద్ద ప్రశ్న‌.

ఎందుకంటే తెలుగు హీరోల‌కు బాలీవుడ్ అచ్చు రాలేదు. చిరంజీవి ద‌గ్గర నుంచి రామ్‌చ‌ర‌ణ్ వ‌ర‌కూ అంద‌రూ బోల్తా ప‌డిన వాళ్లే. అలాంటి చోట ప‌వన్ నెగ్గుకు రాగ‌ల‌డా?? త‌న స్టామినా అక్కడా చూపించ‌గ‌ల‌డా?? అనేది తేలాల్సివుంది. పైగా ఒప్పుకొన్న సినిమాల్ని పూర్తి చేయ‌డానికే రెండు మూడేళ్లు ప‌డుతుంది. ఆ త‌ర‌వాతే హిందీ సినిమా గురించి ఆలోచించాలి. ఒక‌వేళ ప‌వ‌న్‌కి హిందీకి వెళ్లాల‌నే ఆలోచ‌న ఉన్నా, టైమ్ మాత్రం ఉండ‌దు. అందుకే ప‌వ‌న్ బాలీవుడ్‌కి వెళ్లడం దాదాపు అసాధ్యం అనేది విశ్లేష‌కుల మాట‌. మ‌రి అభిమానులు ఏమంటారో..? ప‌వ‌న్‌ని బాలీవుడ్ తెర‌పై చూడాల‌నుకొంటున్నారా?? తెలుగు సినిమాల్లో మెరిస్తే చాల‌నుకొంటున్నారా??

Exit mobile version