Site icon TeluguMirchi.com

ప‌వ‌న్‌పై మ‌నసాయెందుకో..?!

pavan1ఎలాంటి చ‌డీ చ‌ప్పుడూ లేకుండా సాగిపోయిన అంత‌ర్జాతీయ బాల‌ల దినోత్సవం ప‌వ‌న్ క‌ల్యాణ్ రాక‌తో ఘ‌నంగా ముగించుకొంది. ఈ వేడుక‌కు ప‌వ‌న్‌ని ముఖ్యమంత్రి ప‌నిగ‌ట్టుకొని పిల‌వడం, ప‌వ‌న్ రావ‌డం, ఈ కార్యక్రమాన్ని దిగ్విజ‌యం చేయ‌డం అంతా.. చ‌క‌చ‌క అనుకొన్నట్టుగానే సాగిపోయాయి. ఈ విష‌యాన్ని ప‌వ‌న్ అభిమానులు ఇంత‌టితో వ‌ద‌ల‌డం లేదు. ప‌వ‌న్ ఎందుకొచ్చిన‌ట్టు? దీని వెనుక రాజ‌కీయ‌ప‌ర‌మైన లాభ‌లూ, కార‌ణాలూ ఉన్నాయా? అంటూ ఆరా తీస్తున్నారు.

నిజ‌మే.. వారి అనుమానాల‌కూ కార‌ణం ఉంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ సాధార‌ణంగా సినిమా వేడుక‌ల‌కు హాజ‌ర‌వ్వరు. అది ప్రభుత్వప‌ర‌మైన కార్యక్రమం అయితే మ‌రీనూ. కానీ ఈసారి మాత్రం ప‌వ‌న్‌ని తీసుకురావ‌డంలో ప్రభుత్వం స‌ఫ‌లీకృత‌మైంది. బాల‌ల చిత్రోత్సవం హైద‌రాబాద్ లో జ‌రుగుతున్నా… సినిమా తార‌ల సంద‌డి లేద‌ని విమ‌ర్శలు వ‌స్తున్నాయి. వాటిని తిప్పికొట్టాలంటే, ప్రజ‌ల్లోవిప‌రీత‌మైన అభిమానం ఉన్న ఓ స్టార్‌ని ముగింపు వేడుక‌ల‌కు తీసుకురావ‌డం త‌ప్పనిస‌రైంది. అందుకే ఆఘ‌మేఘాల‌మీద ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆహ్వానం అందింది. ఇచ్చిన మాట కాద‌న‌క‌.. ప‌వ‌న్ కూడా ఈ కార్యక్ర‌మానికి వ‌చ్చాడు. అది ప‌క్కన పెడితే గ‌వ‌ర్నర్ రంగ‌రాజ‌న్ నుంచి ప‌వ‌న్ మాట రావ‌డం, వ‌వ‌న్‌ని ఆయ‌న ప‌దే ప‌దే ప‌వ‌ర్ అంటూ కీర్తించ‌డం – అంద‌రినీ ఆక‌ట్టుకొంది. అదే ప్రాంగణంలో ముఖ్యమంత్రి ఉంటే ప‌వ‌న్‌ని ఏవిధంగా కీర్తించేవాడో అనుకొంటున్నారు అభిమానులు. ప‌వ‌న్ మానియాను ప్రభుత్వం కూడా వాడుకోవాల‌ని చూస్తోందని ఈ కార్యక్రమం సాగిన విధానం చూస్తే అర్థమ‌వుతోంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల‌కు ప‌వ‌న్‌ని వాడుకోవాల‌ని త‌ద్వారా ప‌వ‌న్ మావాడే.. అనే సంకేతాలు ప‌రోక్షంగా ప్రజ‌ల‌కు పంపాల‌ని ప్ర‌భుత్వం చూస్తోంద‌నే వాద‌న‌లూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా… ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్‌… ప్రభుత్వానికీ తెలిసింద‌న్నమాట‌. అది మాత్రం ప‌వ‌న్ అభిమానుల్ని ఖుషీ చేసే విష‌య‌మే.

Exit mobile version