Site icon TeluguMirchi.com

మహేష్ టీజర్.. పవన్ ఫ్యాన్స్ వాడకం

శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్-కొరటాల కాంబోలో వస్తున్న సినిమా భరత్ అనే నేను. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. ఆ విషయాన్ని టీజర్ లో మరోసారి స్పష్టంచేశారు. ‘చిన్నప్పుడు మా అమ్మ నాకు ఓ మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్‌ చేసి ఆ మాట తప్పితే యు ఆర్‌ నాట్‌ కాల్డ్‌ ఎ మ్యాన్‌ అని. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మర్చిపోలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్‌ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. పెద్దదే కాదు కష్టమైంది కూడా”అంటూ ‘భరత్‌ అనే నేను’ టీజర్ రిలీజ్ చేశారు.

ముఖ్యమంత్రిగా ఎగ్రెసివ్ లుక్స్ తో పాటు, ఎమోషనల్ వాయిస్ తో మహేష్ ఆకట్టుకున్నాడు మహేష్. ఇప్పుడు టీజర్ వైరల్ కూడా అయ్యింది. ఇందులో ”భరత్ రామ్ ముఖ్యమంత్రి” అంటూ ఓకే నేమ్ బోర్డ్ వుండే షాట్ ఉటుంది. ఇప్పుడు ఆ సీన్ ని ఎడిట్ చేసి పవన్ కళ్యాణ్ మఖ్యమంత్రి అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ తమ అభిమానం చాటుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది.

Exit mobile version