Site icon TeluguMirchi.com

పవన్‌ సలహాతో ఆలోచనలో పడ్డ శృతిహాసన్‌

pawan kalyan
కమల్‌ హాసన్‌ కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసిన శృతిహాసన్‌ తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకుని ఒక్క సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటుతుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తున్న ముద్దుగుమ్మ శృతిహాసన్‌ యమ బిజీగా గడుపుతూ ఉంది. సౌత్‌ సినిమాల కంటే ఎక్కువగా బాలీవుడ్‌ సినిమాలపై ఆసక్తి కనబర్చుతూ, అక్కడ వచ్చిన చిన్నా చితక ఆఫర్లకు కూడా ఓకే చెబుతూ శృతిహాసన్‌ కెరీర్‌ కొనసాగిస్తుంది. ఈ సమయంలోనే పవన్‌ కళ్యాణ్‌ సలహాతో శృతి ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ‘కాటమరాయుడు’ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌కు జోడీగా ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సమయంలోనే బాలీవుడ్‌లో తనకు రాణించాలని ఉందని, సౌత్‌ సినిమాలకు పూర్తిగా దూరం అవ్వాలనే ఉద్దేశ్యంతో తాను ఉన్నట్లుగా పవన్‌ కళ్యాణ్‌తో శృతిహాసన్‌ చెప్పుకొచ్చింది.

అందుకు పవన్‌ కళ్యాణ్‌ స్పందించి సరైన అవకాశాలు రాని బాలీవుడ్‌ కన్నా, స్టార్‌ హీరోలతో ఛాన్స్‌లు తెచ్చి పెడుతున్న సౌత్‌ ఇండస్ట్రీనే ఉత్తమం అని, బాలీవుడ్‌లో స్టార్స్‌తో అవకాశం వస్తే నటించు కాని, చిన్న చితక సినిమాల్లో నటించకు అంటూ శృతిహాసన్‌కు సలహా ఇచ్చాడట. దాంతో సౌత్‌ను వదిలేయాలనే ఆలోచనను, బాలీవుడ్‌పై మోజును శృతిహాసన్‌ మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి పవన్‌ చెప్తాడు కనుక శృతి ఆయన సలహా ప్రకారం కెరీర్‌ను ప్లాన్‌ చేసుకోవాలని నిర్ణయించుకుంది.

Exit mobile version