Site icon TeluguMirchi.com

పవన్ కి రామభక్తిని అలవాటు చేసిన చిరు

హనుమజ్జయంతి సందర్భంగా హనుమంతుడి ఫొటో పోస్ట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ”ఆంజనేయస్వామితో నాకు చాలా అనుబంధం ఉంది.. చిన్నప్పటి నుంచి. 1962లో నాకు ఓ లాటరిలో ఈ బొమ్మ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది. ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా? ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు ఆ కనుబొమ్మలు, కళ్లు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయన్నారు’ అని రాసుకొచ్చారు.

చిరు చేసిన పోస్ట్ పై తమ్ముడు పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. ‘మా ఇంట్లో హనుమంతుడిని ఆరాధించడమనేది అన్నయ్య చిరంజీవిగారి వల్లే అలవాటైంది. ఇదే విషయం మా నాన్నను నాస్తిక, కమ్యూనిస్టు భావాల నుంచి రాముడి భక్తుడిగా మార్చింది. నా టీజేన్‌లో ఉన్నప్పుడు నేను హనుమంతుడి చాలీసాను 108 సార్లు అప్పుడప్పుడు చదివేవాడిని. జై హనుమాన్’ అని ఆరాసుకొచ్చారు పవన్.

Exit mobile version