భరత్ అనే నేను థియేటర్స్ లలో పవన్ ఫ్యాన్స్ సందడి..

మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ఈరోజు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. సాధారణం గా తమ హీరో సినిమా రిలీజ్ అంటే ఆ హీరో అభిమానులు మాత్రమే సంబరాలు జరుపుకుంటారు. కానీ భరత్ అనే నేను చిత్ర రిలీజ్ థియేటర్స్ లలో పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకోవడం మొదటిసారి చూస్తున్నాం.

నటి శ్రీ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫై చెప్పలేని విధంగా అసభ్యకరమైన కామెంట్స్ చేసిన సంగతి తెల్సిందే. ఈ వ్యవహారం ఫై పవన్ అభిమానులే కాదు మహేష్ బాబు ఫ్యాన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘మేము మేము ఎన్నైనా కొట్టుకుంటాం గానీ, ఇతరులు మా హీరోలను అకారణంగా అంటే మాత్రం సహించం, ఈ సందర్భంలో మా మద్దతు పూర్తిగా పవన్ కళ్యాణ్ కే’ అంటూ సోషల్ మీడియా లో కురిపించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ మహేష్ అభిమానుల పట్ల ఎంతో ప్రేమ కురిపించారు. అందుకే ఇప్పుడు మహేష్ సినిమా రిలీజ్ కావడం తో ఆ సంబరాల్లో వీరు భాగం అయ్యారు. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నారు. అంతే కాదు సినిమా గురించి ఎక్కడ కూడా నెగిటివ్ ప్రచారం చేయకూడదని మాట్లాడుకున్నారు.