గతంలో అల్లు అర్జున్ ఓ స్టేజ్ ఫై పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అని అభిమానులు అడిగితే చెప్పను బ్రదర్ అని పెద్ద వివాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ఒక్క మాట బన్నీ అనడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు రెండేళ్ల పాటు బన్నీ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. ఆ తర్వాత పవన్ జోక్యం తో కాస్త శాంతించారు. తాజాగా మరోసారి బన్నీ ఫై అభిమానులు ఫైర్ అవుతున్నారు.
నిన్న పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా పుట్టిన రోజు అనే సంగతి తెలిసిందే. అకీరా పుట్టిన రోజు సందర్బంగా చిరంజీవి.. నాగబాబు.. రామ్ చరణ్.. సాయి ధరమ్ తేజ్.. వరుణ్ తేజ్ లు ట్విట్టర్ లో విషెష్ చెప్పారు. ఇక ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అకీరా పుట్టిన రోజు హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. పలువురు ప్రముఖులు కూడా అకీరాకు విషెష్ చెప్పగా బన్నీ మాత్రం అకీరాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పకపోవడం పవన్ అభిమానుల్లో ఆగ్రహం తెప్పిస్తుంది. నిన్న పుట్టిన రోజు జరుపుకున్న అఖిల్ అక్కినేనికి బన్నీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. కాని అకీరారకు చెప్పక పోవడం ఏంటీ అంటూ పవన్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మరి బన్నీ ఏ ఉద్దేశ్యం తో అకిరా కు విష్ చేయలేదో మరి.