పవన్ తో పండగ చేసుకున్న అలీ

Pawan celebrates Ali’s doctorateటాలీవుడ్ లో పవన్ కల్యాణ్ హాస్యనటుడు అలీ స్నేహం కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకా   చెప్పాలంటే పవన్ ప్రతి సినిమాలో అలీ తప్పని సరిగా ఓ రోల్ లో కనపడాల్సిందే. ఇండస్ట్రీ లో పవన్ తో క్లోజ్ గా మూవ్ అయ్యే వాళ్ళలో అలీనే ముందుంటాడు. అయితే సెలబ్రేషన్ కు దూరంగా వుండే పవన్ మాత్రం క్లోజ్ ప్రెండ్స్ జరుపుకునే పండగలకు హాజరౌతారు. తాజాగా అలీ కి గౌరవ డాక్టరేట్ వచ్చిందని తెలియగానే ‘అత్తారింటికి దారేది’ చిత్రం షూటింగులో వున్న పవన్ అలీకి కంగ్రాట్స్ చెప్పి, ప్రత్యేకంగా కేక్ తెప్పించి అలీ చేత కట్ చేయించాడు. ఈ వేడుకలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత మూడున్నర దశాబ్దాలుగా తన హాస్యాభినయంతో తెలుగు ప్రేక్షకులకు నవ్విస్తున్న అలీకి ఈ నెల 25న ‘అకాడమీ ఆఫ్ యూనివేర్సాల్ గ్లోబల్ పీస్’ సంస్థ కోయంబత్తూర్లో ఈ గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేస్తోంది.