Site icon TeluguMirchi.com

పవన్ మెగా ఫంక్షన్ కి రావడానికి ఆమె కారణమట..

KhaidiNo150-sundari

చిరంజీవి నటించిన ఖైదీ నెం 150 కి సంబదించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 7 న విజయవాడ – గుంటూరు మధ్యలో ‘హాయ్ ల్యాండ్’ ఎమ్యూజ్ మెంట్ పార్క్ లో జరగబోతున్న సంగతి తెల్సిందే.ఈ మెగా వేడుకకు మెగా హీరోలందరూ హాజరవుతున్నారు..అయితే పవర్ పవన్ కళ్యాణ్ వస్తాడా రాడా అని అభిమానుల్లో ఒకటే ఆత్రుత..తాజాగా సమాచారం ప్రకారం ఈ ఫంక్షన్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడట..

నిన్నటివరకు పవన్ కళ్యాణ్ రాకపోవచ్చని చెప్పకనే చెప్పారు చరణ్ , అల్లు అరవింద్ లు..కానీ సడెన్ గా ఇప్పుడు పవన్ రావడం ఫిక్స్ అయ్యిందని చెప్పడం తో ఇది నిజామేనా అని అభిమానులు అనుకుంటున్నారు..వాస్తవానికి పవన్ ఈ ఫంక్షన్ కు రావద్దనే అనుకున్నాడట కానీ చిరంజీవి భార్య సురేఖ , స్వయంగా పవన్ దగ్గరికి వెళ్లి ఫంక్షన్ కు రావాలని కోరిందట.

సురేఖ అంటే పవన్ కి అభిమానం. పలుమార్లు వేదికలపై వదిన సరేఖ నాకు తల్లిలాంటిదని చెప్పుకొన్నారు. అలాంటి వదిన స్వయంగా వచ్చి మెగా ఫంక్షన్ ని ఆహ్వానిస్తే..రాకుండా ఎలా ఉంటాను అని పవన్ ఫంక్షన్ కు రావడానికి నిర్ణయం తీసుకున్నాడట. ఫంక్షన్ చివర్లో పవన్ రావచ్చని అంటున్నారు..లేటుగా వచ్చిన పవన్ రావడమే మాకు కావాలని అభిమానులు అంటున్నారు..ఇక మెగా ఫంక్షన్ లో ఏ లోటు లేదన్నమాటే..

Exit mobile version