చాలా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన సమీర్ తాజాగా పవన్, త్రివిక్రమ్‌ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో తాను పవన్ సినిమాని చూసి బాగోలేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నాకు ఫోన్ చేసి మరీ తిట్టాడు. నువ్వు అంత పెద్ద మగాడివా..? పవన్ సినిమానే బాలేదు అని రివ్యూ రాస్తావా ఏమనుకుంటున్నావ్ ఏంటి అని నన్ను ఫోన్లో తెగ తిట్టేశాడు. దాంతో వెంటనే నేను ఆ పోస్ట్‌ను డిలీట్ చేశాను. ఆ తర్వాత పవన్ నాకు కాల్ చేసి ఎందుకు డిలీట్ చేశావ్ అని అడిగాడు. నేను మొత్తం చెప్పగా నీకు అనిపించింది నువ్వు పెట్టినావు, ఆయన తిట్టినంత మాత్రానా నీ ఫీలింగ్ మారదు కదా, నువ్వు కూడా ఆయనకు ఫోన్ చేసి తిట్టు అంటూ పవన్ కళ్యాణ్ నాతో చెప్పారు కానీ నేను ఆ సాహసం చేయలేకపోయా అని సమీర్ తాజాగా వ్యాఖ్యానించాడు.
ఆ తర్వాత నాకు త్రివిక్రమ్ నుండి కాల్ వచ్చింది, ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ఒక పాత్ర ఉంది చేస్తావా అని త్రివిక్రమ్ అడిగాడు, నేను వెంటనే ఒకే చెప్పగా సెట్‌కు పిలిచాడు. సెట్లో మొదటగా పవన్ నన్ను చూసి నువ్వేంటి ఇక్కడ అని ప్రశ్నించాడు. నేను నన్ను త్రివిక్రమ్ ఒక పాత్ర కోసం పిలిచాడు అని చెప్పగా పవన్, త్రివిక్రమ్‌ను పిలిచి ఏంటి అని అడిగాడు. దాంతో త్రివిక్రమ్ నేనే పిలిచా అని చెప్పగా, పవన్ మా ఇద్దరికి అప్పుడు గొడవ అయ్యింది తెలుసా అని అడిగాడు, త్రివిక్రమ్ తెలియదు అనగా నీకు నేను కావాలా..? సమీర్ కావాలా..? అని పవన్ త్రివిక్రమ్‌ను ప్రశ్నించాడు. దాంతో ఆయన సమీర్ కావాలని అనగానే నా గుండె ఆగినంత పని అయ్యింది. ఆ తర్వాత ఇద్దరు గట్టిగా కౌగిలించుకుని నవ్వుకున్నారు అలా పవన్, త్రివిక్రమ్‌లు నాతో ఆడుకున్నారు అంటూ సమీర్ చెప్పుకొచ్చాడు.