ఫొటోటాక్‌ : బెంగళూరులో భార్యతో పవన్‌

పవన్‌ ఈమద్య కాలంలో ఎక్కువగా రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నాడు. హైదరాబాద్‌, అమరావతి అంటూ అటూ ఇటు తిరుగుతూ రాజకీయాలు చేస్తున్నాడు. రాజకీయ నాయకులతో పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో తాజాగా ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్‌ కళ్యాణ్‌ బెంగళూరు వెళ్లాడు. ఈ సందర్బంగా ఆయన భార్య అన్నా లెజ్నోవా కూడా ఉంది. వీరిద్దరు కలిసి బెంగళూరు ఎయిర్‌ పోర్ట్‌లో అక్కడున్న వారికి కనువిందు చేశారు.

బెంగళూరుకు పవన్‌ వెళ్లిన విషయమై ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఆయన ప్రైవేట్‌ కార్యక్రమంలో హాజరు అయ్యాడని తెలుస్తోంది. ఫ్యామిలీతో వెళ్లాడు కనుక ఏదైనా ముఖ్యమైన పని అయ్యి ఉంటుందని కూడా అంటున్నారు. పిల్లలను తీసుకుని వెళ్లకుండా పవన్‌ మరియు అన్నా మాత్రమే వెళ్లినట్లుగా తెలుస్తోంది. పవన్‌ ఒక్క రోజు పర్యటన ముగిసి హైదరాబాద్‌ చేరుకున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ ఈ ఫొటోల్లో కాస్త బొద్దుగా అయినట్లుగా అనిపిస్తుంది కదా..?