చిరంజీవి ని ఎన్టీఆర్ పోల్చిన పవన్..

చిరంజీవి నటించిన సైరా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ఇండస్ట్రీ నుండి ఎంతో మంది ప్రముఖులు హాజరై సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చిన పవన్ కళ్యాణ్..అన్నయ్య ఫై ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు ప్రస్తావన తీసుకొచ్చారు. ‘‘అనుభవానికి నేను చాలా పెద్దపీట వేస్తాను. ఇదెప్పుడు నేర్చుకున్నానంటే.. అన్నయ్య ‘ఖైదీ’ సినిమా విడుదలైన తరవాత. చిరంజీవిగారికి చాలా బలమైన స్టార్ డమ్ స్టార్ట్ అయినప్పుడు ఒక తమ్ముడిగా మా అన్నయ్య చాలా పెద్ద హీరో అని అనుకున్నాను. ఆ సమయంలో ఎన్టీ రామారావు గారి ‘విశ్వామిత్ర’ సినిమా వచ్చింది. ఆ సినిమా అన్ని రికార్డులను బద్దలుకొట్టేసింది. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే.. ఒక వ్యక్తి తాలూకా అనుభవాన్ని ఎప్పుడూ తీసేయలేం. అలాగే ఎంత మంది కొత్తవాళ్లు వచ్చినా, ఎంత మంది రికార్డులు బద్దలుకొట్టినా చిరంజీవి గారి అనుభవాన్ని కొట్టేయలేం’’ అని పవన్ అన్నారు.

తానెంతగానో గౌరవించే అన్నయ్య ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి భారతదేశం గర్వించదగిన సినిమా తీయడం పట్ల తనకు చాలా ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అలాగే సినిమా డబ్బింగ్ పట్ల కూడా ప్రస్తావించి అందర్నీ ఆనందపరిచారు.