పవన్ కళ్యాణ్ 28 మూవీ ఫిక్స్..డైరెక్టర్ ఎవరో తెలుసా..?

పవన్ స్పీడ్ పెంచాడు..ఓ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరో సినిమాకు క్లాప్ కొడుతూ అభిమానుల్లో ఆనందం నింపుతున్నారు. ప్రస్తుతం పింక్ రీమేక్ లో నటిస్తుండగానే..క్రిష్ డైరెక్షన్లో తన 27 వ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. ఇదే నెలలో ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడు. ఖుషి నిర్మాత ఏ ఎం రత్నం ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా నిర్మించబోతున్నారు. కాగా ఇప్పుడు మరో సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

పవన్ కెరియర్ లోనే భారీ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో పవన్ తన 28 వ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ కి సంబందించిన పూర్తీ వివరాలు రానున్నాయి. రీసెంట్ గా హరీష్..వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టాడు. మరి పవన్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.