సేఫ్‌ జోన్‌ లో ప‌విత్ర!

Pavitraశ్రియ మ‌ళ్లీ ఫామ్‌ లోకి రాబోతోంది. త‌న టాలెంట్‌ ని పూర్తి స్థాయిలో చూపించ‌బోతోంది? ప‌విత్ర ప్రచార చిత్రాలు, పోస్టర్లు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సెన్సార్ రిపోర్ట్ కూడా ఈ సినిమాకి చాలా పాజిటివ్‌ గా వ‌చ్చింది. దాంతో బ‌య‌ర్లు ఈ సినిమాపై దృష్టి పెట్టారు. అన్ని ఏరియాల నుంచి మాంచి రేట్లొచ్చాయి. మొత్తమ్మీద ఈ సినిమా విడుద‌ల‌కు ముందే.. లాభాల్లో ప‌డింది. జ‌నార్థన మ‌హ‌ర్షి ద‌ర్శక‌త్వం వ‌హించిన చిత్రమిది. ‘దేవ‌స్థానం’ త‌ర‌వాత ఆయ‌న తీర్చిదిద్దిన సినిమా ఇదే. ఓ బ‌ల‌మైన సామాజిక అంశంతో ముడిప‌డిన క‌థ ఇది. ఆడ‌ది బ‌ల‌హీనురాలు కాదు.. శ‌క్తి స్వరూపిణి అనే విష‌యాన్ని క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను జోడించి చెప్పబోతున్నారు. ఓ వేశ్య క‌థే అయినా… కుటుంబ స‌మేతం గా చూసేలా తీర్చిదిద్దార‌ట‌. త్వర‌లోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.