Site icon TeluguMirchi.com

రెండు పాటలు మినహా పూరైన ‘పవిత్ర’

pavithraశ్రియ టైటిల్ రోల్ లో జనార్థన మహర్షి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పవిత్ర’ ఉపశీర్షిక ‘ఎ బోల్డ్ అండ్ గోల్డ్ ఫిల్మ్’. కె. సాదక్ కుమార్, జి. సాయిమహేశ్వర రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. “జనార్థన మహర్షి అద్భుతమైన కథ ఇచ్చారు. కథనం కూడా బాగా కుదిరింది. టైటిల్ రోల్ ని శ్రియ అద్భుతంగా చేస్తోంది. స్త్రీ ఔన్నత్యాన్ని చాటి చెప్పే చిత్రం ఇది. నిజాయితిగా ఓ మంచి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఇది బోల్డ్ సినిమా అయినా గోల్డ్ గా ఉంటుందని దర్శకుడు అంటున్నారు” అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ… “ శ్రియ కొత్త కోణంలో కనిపించే చిత్రం ఇది. అలాగే కౌశిక్ కు ఈ చిత్రం మంచి బ్రేక్ అవుతుంది. ఇప్పటివరకు చేయని పాత్రను రోజా ఇందులో చేస్తున్నారు. ఇందులో ఉన్న ప్రతి పాత్రకు ప్రధాన్యం ఉంటుంది. మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం” అని చెప్పారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఏవీయస్, సాయికుమార్, శివాజి, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : ఎం.ఎం. శ్రీ లేఖ, కెమెరా : సురేష్ కుమార్, నిర్మాతలు : కె. సాదక్ కుమార్, జి. సాయిమహేశ్వర రెడ్ది, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : జనార్థన మహర్షి.

 

Exit mobile version