Site icon TeluguMirchi.com

ప‌విత్ర ఊరిస్తోంది

Pavitraవేశ్య పాత్రల‌తో వ‌చ్చే సినిమా వ‌స్తొందంటే అందరికీ ఆస‌క్తే! హాట్ స‌న్నివేశాలేమైనా ఉంటాయా? క‌థానాయిక మ‌రీ బోల్డ్‌ గా క‌నిపిస్తుందా? సంభాష‌ణ‌లు ఏ రేంజ్‌ లో ఉంటాయో..? అని ర‌క‌ర‌కాలుగా ఆలోచిస్తుంటాయి ర‌స హృద‌యాలు. ఇప్పుడు వారంద‌రి దృష్టీ.. ‘ప‌విత్ర’పై ప‌డింది. జ‌నార్థన మ‌హ‌ర్షి ద‌ర్శక‌త్వం వహించిన చిత్రమిది. శ్రియ క‌థానాయిక‌. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ప‌విత్రగా… శ్రియ అన‌గానే – ఈ సినిమాపై చిత్ర ప‌రిశ్రమ ఓ లుక్ వేసింది. దానికి త‌గిన‌ట్టుగానే ప్రచార చిత్రాలు, ట్రైల‌ర్లు ఈ సినిమాపై ఆస‌క్తిని పెంచేశాయి. శ్రియ ఎప్పుడూ లేనంత ఫ్రెష్ లుక్‌ లో కనిపిస్తోంది. పైగా జ‌నార్థన మ‌మ‌ర్షి రాసిన సంభాష‌ణ‌లు… ఆలోచింప‌జేస్తున్నాయి. అయితే ప‌విత్ర ఏ స‌ర్టిఫికెట్ సినిమా అనుకొంటే పొర‌పాటే! ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియ‌న్స్ చూసేలా తీర్చిదిద్దార‌ట‌. బోల్డ్ బ‌ట్ గోల్ట్ అని క్యాప్షన్‌ లో చెప్పిన‌ట్టుగానే ఈ సినిమాని క్లీన్‌ గా రూపొందించార‌ట‌. బోల్డ్ క్యారెక్ట‌ రైజేష‌న్‌ తో ఫ్యామిలీ మొత్తం చూసేలా తీయ‌డం అంటే క‌త్తిమీద సామే! మ‌రి జ‌నార్థన మ‌హ‌ర్షి ఈ క‌థ‌ని ఎలా టేక‌ప్ చేశాడో?? ఈ నెల‌లో నే ప‌విత్ర విడుద‌ల కాబోతోంది. న‌టిగా శ్రియ కెరీర్‌ కూ, ద‌ర్శకుడిగా జ‌నార్థన మ‌హ‌ర్షికీ ఈ సినిమానే కీల‌కం. ఏమ‌వుతుందో చూడాలి.

Exit mobile version