శ్రియ ప్రధాన పాత్రలో ప్రముఖ రచయిత జనార్దన్ మహర్షి దర్సకత్వంలో రూపొందిన ” పవిత్ర ” చిత్రం శుక్రవారం ఉదయం సెన్సార్ సభ్యుల ముందుకు రానుంది, నాలుగు రోజుల క్రితమే సెన్సార్ కావలసిన ఈ సినిమా సెన్సార్ ఆఫీసర్ శ్రీమతి ధనలక్ష్మి ఊళ్ళో లేని కారణంగా శుక్రవారం నాటికి వాయిదా పడినట్టు తెలిసింది. వేశ్య పాత్రలో శ్రియ నటిస్తున్న ఈ సినిమా తాలూకు ప్రోమోలు , ఫోటోలు, ట్రైలర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వేడి పుట్టించాయి కూడా. యూ ట్యూబ్ లో ఈ ట్రైలర్లు హల్ చల్ చేశాయి. సినిమా పట్ల ఒక స్పైసీ ఇమేజ్ ను కలగచేసాయి. ఈ ప్రోమోలు విడుదల అయిన తరువాతనే ఈ సినిమా బిజినెస్ చాలా వేగంగా జరిగింది. నిర్మాతలు అన్ని ఏరియాల బిజినెస్ క్లోజ్ చేశారు. వాస్తవానికి ఈ నెల 10 వ తేదీనే ఈ సినిమా విడుదల కావలసి వుంది. అయితే సెన్సార్ లో జాప్యం, 10 వ తేదిన తడాఖా, సుకుమారుడు సినిమాల విడుదల కారణంగా ఏర్పడిన థియేటర్ల కొరత ల వల్ల 17 కు వాయిదాపడింది. శుక్రవారం నాడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సినిమా బయటపడితే అనుకున్నట్టు 17 విడుదల అయేందుకు అవకాశం వుంది. ” దేవస్థానం ” లాంటి సినిమా రూపొందించిన జనార్దన్ మహర్షి దర్సకత్వంలో రూపొందిన ఈ ‘ పవిత్ర ‘ సినిమా రసజ్ఞులను ఆకట్టుకుంటుందో రసికులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి !