Site icon TeluguMirchi.com

పవన్ ఆ రికార్డును కొడతాడా?

pavan2పవన్ కళ్యాణ్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడని వార్తలు హాల్ చల్ చేస్తుంటే, ఆయన ఫ్యాన్స్ మాత్రం 2014కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. విషయం ఎమిటంటే… 2012 నుంచి పవర్ స్టార్ కెరీర్ జెట్ స్సీడుతో దూసుకుపోతుంది. 2012 ముందు వరుస ప్లాప్ ఉన్న పవర్ స్టార్ 2012లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ తో భారీ హిట్టును సొంతం చేసుకున్నాడు. గబ్బర్ సింగ్ 2012 బిగెస్ట్ హిట్టుగా నిలువడమే కాకుండా ఇండస్ట్రీ భారీ హిట్స్ లో టాప్ 2 ప్లేస్ లో నిలిచింది.

2012లో టాప్ హిట్టు ఇచ్చిన పవర్ స్టార్ 2013లో కూడా భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఈసారి ‘అత్తారింటికి దారేది’ సినిమాతో పవన్ కళ్యాణ్ టోటల్ ఇండస్ట్రీ రికార్ట్స్ అన్నింటికి తుడిచేసి కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేశాడు. సుమారు వందకోట్ల కలెక్షన్లను రాబట్టి తెలుగు సినిమా కు వందకోట్ల కలెక్షన్లకు దారిని చూపించాడు. 2013లో అత్తారింటికి సినిమానే పెద్ద హిట్టుకావడమే కాకుండా నెంబర్ వన్ ఇండస్ట్రీ హిట్టు నిలిచింది.

ఇక 2014లో కూడా తమ హీరో గత రెండేళ్ల మాదిరే మరో పెద్ద హిట్టు ఇస్తాడని పవన్ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. కొత్త ఎడాదిలో పవర్ స్టార్ ‘గబ్బర్ సింగ్ 2’తో ప్రేక్షకులను అలరించనున్నాడు. సంపత్ నంది డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నా ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2014లో కూడా పవన్ కళ్యాణ్ భారీ హిట్టు అందిస్తే వరుసగా మూడేళ్లు భారీ హిట్స్ ఇచ్చిన స్టార్ గా ఆయన మరో రికార్డ్ ను నెలకోల్సానున్నాడు. అందుకోసమే పవన్ ప్యాన్స్ 2014 కోసం తెగ ఎదురుచూస్తున్నారు. 2014 లో వస్తున్న ‘గబ్బర్ సింగ్ 2’ హిట్ బాట పడితే పవన్ కు హ్యాట్రిక్ హిట్ ఇయర్స్ అందినట్టే. మరి గబ్బర్ సింగ్ 2 ఇచ్చే పలితం బట్టే పవన్ హ్యాట్రిక్ రికార్డ్ ఆదారపడి వుంది.

Exit mobile version