చిక్కుల్లో ప‌వ‌న్ టైటిల్‌?

gabbar_singh2గ‌బ్బర్ సింగ్ 2 టైటిల్ ఇప్పుడు చిక్కుల్లో ప‌డింది. గ‌బ్బర్‌సింగ్ అనే పాత్రపై హ‌క్కుల‌న్నీ మావే.. ఆ పేరు వాడుకొన్నా రాయ‌ల్టీ చెల్లించాల‌ని షోలే నిర్మాత‌లు వాదిస్తున్నారు. ఈ టైటిల్‌కి రాయ‌ల్టీగా భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నారు. షోలేలో గ‌బ్బర్ సింగ్ పాత్ర ఎంత‌… పాపుల‌ర్ అయ్యిందో అంద‌రికీ తెలిసింది. అస‌లు షోలే అన‌గానే గుర్తొచ్చేది ఆ పేరే. అందుకే ఇప్పుడు గ‌బ్బర్ సింగ్‌ని వ‌దులుకోవ‌డానికి షోలో నిర్మాత‌లు సిద్ధంగా లేరు. దాంతో గ‌బ్బర్ సింగ్ 2 నిర్మాత‌లు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. ఇలాంటి వాద‌ల‌న్నీ కోర్టులో నిల‌బ‌డ‌వు కానీ – కోర్టు తీర్పు వచ్చే వ‌ర‌కూ ఎవ‌రికైనా కంగారే. ఎందుకొచ్చిన గొడ‌వ‌.. అనుకొని మ‌రో పేరు చూసుకొందామంటే – గ‌బ్బర్ సింగ్ 2 పేరు తో ఆల్రెడీ ఆ సినిమాకి కావ‌ల్సినంత పాపులారిటీ వ‌చ్చేసింది. మ‌రి ఇప్పుడు ఏం చేస్తారో?? అడిగినంత ఇచ్చి గ‌బ్బర్‌సింగ్ టైటిల్ కొనుక్కొంటారో, లేదో న్యాయ స్థానంలో వాదించుకొంటారో కాల‌మే చెప్పాలి.