ఎన్టీఆర్‌కి ఎస‌రు పెడుతున్నప‌వన్‌??

ntr_pawanఎంకిపెళ్లి సుబ్బిచావుకి వ‌చ్చిన‌ట్టు.. ఒక సినిమా వాయిదా ప‌డితే ఆ వెనుక‌నే మిగ‌తా సినిమాలపై ప్రభావం ప‌డిపోతుంది. డేట్లన్నీ తారుమారు అవుతాయి. ప్రస్తుతం అదే జ‌రుగుతోంది. ఎవ‌డు, అత్తారింటికి దారేది సినిమాల వాయిదా మిగ‌తా సినిమాల‌పై ప్రభావం చూపిస్తోంది. ఈ సినిమాలెప్పుడొస్తాయో తెలీదు. త‌మ సినిమాల్ని ప‌క్కగా క‌న్‌ఫామ్ చేసుకోలేరు. ఎన్టీఆర్ సినిమా రామయ్యా వ‌స్తావ‌య్యాకీ ఇదే ప‌రిస్థితి. అత్తారింటికి దారేది సినిమాని ఈనెల 26న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకొన్నట్టు స‌మాచారం. గ‌తంలో ప‌లుమార్లు వాయిదా ప‌డిన ప‌వ‌ర్‌స్టార్ సినిమాని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ 26న తీసుకురావాల‌ని భావిస్తున్నార‌ట‌. అదే జ‌రిగితే 27న రావాల్సిన రామ‌య్యా వ‌స్తావయ్యా సినిమా వెన‌క్కి వెళ్లాల్సిందే. ఇప్పటికే దిల్‌రాజు రామయ్యా వ‌స్తావ‌య్యా సినిమాని వాయిదా వేయాల‌ని చూస్తున్నాడు. కార‌ణం… తెలంగాణ‌లో ఎన్టీఆర్ సినిమాని అడ్డుకొంటామ‌ని తెలంగాణ వాదులు హెచ్చరించారు. అందుకే ఈ గొడ‌వ స‌ద్దుమ‌ణిగే వ‌ర‌కూ ఈ సినిమా బ‌య‌ట‌కు తీసుకురాకూడ‌ద‌ని దిల్‌రాజు భావిస్తున్నారు. దీనికి తోడు ప‌వ‌న్ సినిమా కూడా గుబులు పుట్టిస్తోంది.