Site icon TeluguMirchi.com

హోటల్ లో మొదలైన పవన్ సందడి

Pawan Trivikram shoot startedపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమా ఈ రోజు నుంచి మొదలైంది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగు స్పెయిన్లో ప్లాన్ చేసారు. ఇప్పటికే పవన్, తివిక్రమ్ కలిసి విదేశాల్లో పర్యటించి సినిమాకు కావాల్సిన లొకేషన్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. పవన్ సరసన మొదటిసారి సమంత జోడీ కడుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ త్రివిక్రమ్ పూర్తి కమర్షియల్ అంశాలతో, ప్రతి సీన్ వినోదాత్మకంగా, ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కామెడీ, పంచ్ డైలాగులు మేళవించిన తనదైన శైలిలో తెరకెక్కించనున్నాడు.

Exit mobile version