Site icon TeluguMirchi.com

పవర్ స్టార్ హృదయ స్పందన !

pavanగుండె వ్యాధులపై అవగాహన కల్పించేందుకు హృదయ స్పందన ఫౌండేషన్ హైదరాబాద్‌లో వాక్ నిర్వహించింది. నెక్లెస్ రోడ్డులోని పీవీఘాట్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు నిర్వహించిన ఈ నడకనకు సినీహీరో పవన్ కల్యాణ్, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ప్రారంభించారు. అనంతరం పవన్ మాట్లాడారు. మనదేశంలో వైద్య సదుపాయాలు తగినన్ని లేవన్నారు. ప్రభుత్వాలు చేయలేకపోయినా.. ఇలాంటి సంస్థలు వైద్య సేవలపై అవగాహన కోసం కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఇలాంటి వాటికి తన మద్దతు ఉంటుందన్నారు. ఈ వాక్ లో నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version